Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి వారం రోజులు పట్టింది: గజల్ శ్రీనివాస్ బాధితురాలు

  • ఎన్నోసార్లు ప్రయత్నించాక వీడియో రికార్డు సక్సెస్ అయింది
  • వీడియోల్లో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదు
  • ఆడదంటే అబల కాదు
  • గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుంది: బాధితురాలు
ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి తనకు వారంరోజులు పట్టిందని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ బాధితురాలు పేర్కొంది. ‘ఎన్ టీవీ’లో ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘గత డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను ఫిర్యాదు చేసినట్టు ఎవరికీ చెప్పలేదు. డబ్బు కోసం నేను ఫిర్యాదు చేయలేదు. డబ్బును ఆశించే దానినైతే పార్వతిలా నేనూ తప్పు చేసేదాన్ని.

గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు వెనుక ఏ వర్గమూ లేదు. దాదాపు 15 వీడియోలను పోలీసులకు ఇచ్చా. ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి వారం రోజులు పట్టింది. ఎన్నోసార్లు ప్రయత్నించాక వీడియో రికార్డు చేయడం సక్సెస్ అయింది. వీడియోల్లో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదు. తప్పు చేసిన వాడిని ఎదిరించడం తప్పా? ఆడదంటే అబల కాదు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుంది’ అని ఆమె అన్నారు.
gazal
Hyderabad

More Telugu News